కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రైల్వే గేట్ సమీపంలో ఒక వ్యక్తిపై వేటకొడవళ్లతో తీవ్రంగా దాడి చేశారు. గమనించిన స్థానికులు గాయపడిన ఆ వ్యక్తిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఆ వ్యక్తిని మల్కాపురం గ్రామానికి చెందిన బోయ శేఖర్ గా గుర్తించారు. శేఖర్ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |