అక్రమ అరెస్టులు ఆపి అంగన్వాడీ ఆశ పంచాయతి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రాలయం అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మంత్రాలయం మండల కార్యదర్శి హెచ్ జయరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులకు చేసిందేమీ లేదు అని వారు అన్నారు. అంగనవాడి ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేయాలని చూస్తున్నా వారిపై కఠినంగా ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళ హక్కులను అడగనివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం బాధాకరమైన విషయం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఛలో లాంటి కార్యక్రమాలు లేకున్నా కూడా నాలుగు రోజుల నుంచి మహిళా పోలీసులను పెట్టి నిర్బంధించడం సిగ్గుచేటుగా ఉంది నిర్బంధం ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్తపల్లి మండలంలో అంగన్వాడి నాయకురాలిని అమానుషంగా కర్కశంగా కోట్టి హింసించి నానా బూతులు తిడుతూ కొట్టిన కొత్తపల్లి మండలం ఎస్ఐ మూబినా తాజ్ ను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం డిటి శశి శేఖర్ కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి ప్రాణేష్, అంగన్వాడి నాయకులు ఫాతిమా, విశాలాక్షి, ఆశ కార్యకర్తలు పుష్ప, సుజాత, పంచాయతీ కార్మికులు ప్రకాశం, భీమన్న, ప్రసంగి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |