కృష్ణగిరి మండల పరిధిలోని సంగాల గ్రామ శివారులో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని నిల్వ ఉంచారన్న సమాచారంతో సోమవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన కొసనాపల్లి రామకృష్ణ పొలంలో నిల్వ ఉంచిన 17 బాక్స్ ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
వీటిని ఇదే గ్రామానికి చెందిన కురువ గిరిరాజు ఉరఫ్ గిరి, దేవనకొండ మండలం పి. కోటకొండకు చెందిన కురువ రాముడు అక్రమంగా తీసుకు వచ్చినట్లు గుర్తించామన్నారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారని, కర్ణాటక మద్యం విలువ రూ. 60వేల వరకు ఉంటుందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ స్వాములు, కానిస్టేబుళ్లు కృష్ణ, నాగేష్, హోంగార్డు కంబగిరి స్వామి, జయన్న, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |