కర్నూలులో విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ శాఖ కర్నూలు ఆపరేషన్స్ ఎకె. శివప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి 11: 30 గంటల మధ్య వినియోగదారులు 7382614308 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలిపి, పరిష్కారం పొందవచ్చని సూచించారు.
![]() |
![]() |