మహానంది క్షేత్రం లో తెలంగాణరాష్ట్రానికి చెందిన కుమ్మరి నాగమ్మ అనే మహిళ అదృశ్యంపై కేసు నమోదైనట్లు మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి సోమవారం పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీ కుటుంబ సభ్యులతో మహానంది క్షేత్రానికి దైవ దర్శనార్థమై వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలోని నారాయణపేట మండలానికి చెందిన అంతర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
![]() |
![]() |