ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనివర్సిటీల బంద్ లో భాగంగా రాయలసీమ వర్సిటీలో సోమవారం బంద్ పాటించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్, ఆర్‌యూ విభాగం అధ్యక్షులు తిరుమలేష్ తదితరులు పరిపాలన భవనం ముందు నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని పరిశోధక విద్యార్థులకు నెలకు రూ. 15 వేలు స్టైఫండ్ ఇవ్వాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన జరగాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం యూనివర్సిటీ కార్యదర్శి నాగేంద్ర, విభాగ్ కన్వీనర్ రాయుడు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |