ఏపీ హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో మార్పులు చేయాలనే డిమాండ్ చేస్తూ మంగళవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు కర్నూలు బార్ అసిసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ కోర్డినేటర్ వై. జయరాజు తెలిపారు.
కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందించాల్సిన లేఖను కలెక్టర్ పి. కోటేశ్వరరావుకు అందజేస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
![]() |
![]() |