ఆదోని పట్టణ పరిధిలోని సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు ఆదివారం సెబ్ సూపరింటెండెంట్ భరత్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు వేలం పాట నిర్వహించారు. మొత్తం 16 వాహనాలను వేలం వేయగా రూ. 3, 00, 074 ఆదాయం వచ్చినట్లు సెబ్ అధికారులు తెలిపారు. నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
![]() |
![]() |