మంత్రాలయంలోని కర్ణాటక రాష్ట్ర ఓబీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం కెఎస్ ఈశ్వరప్ప, కర్ణాటక ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎన్ఎల్ నరేంద్ర బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మాలేకర్ శ్రీనివాస్, రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ఓబీసీ మోర్చా మురళి నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, కౌతాళం మండల బిజెపి నాయకులు చిరుతపల్లి జి కే బ్రదర్స్, చిన్న ఈరన్న, గోతులదొడ్డి నాగరాజ్, హాల్వి మైబూబ్, గుడికాంబల్లి శ్రీనివాస్, మంత్రాలయం నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |