కర్నూలు నగరంలోని స్థానిక మాసమసీదు గ్రామ సమీపంలో కేసీ కెనాల్ లో లభించిన మృతదేహాన్ని తాలూకా పోలీసులు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరిలించారు. ఆదివారం నీటిపై మృత దేహం తేలియాడుతున్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో తాలుకా పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు.
డోన్ పట్టణానికి చెందిన సీరజ్ (25) స్నేహితులతో కలిసి ఈనెల 11వ తేదీన తెలంగాణ వైపు నుంచి ద్విచక్ర వాహనాలపై మాసమసీదు మీదుగా కేసీ కెనాల్ గట్టుపై నుంచి వస్తుండగా అదుపు తప్పి కాలువలో పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ద్విచక్రవాహనం గట్టుపై ఉండడంతో దానిని స్వాధీనం చేసుకొని సీరజ్ కుటంబ సభ్యులకు సమాచారం చేరవేసినట్లు పోలీసులు తెలిపారు.
![]() |
![]() |