కర్నూలు జిల్లాలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు అనుమతి లేకుండా సమ్మెలో పాల్గొనేందుకు వెళ్తే చర్యలు తీసుకుంటామని డీఈవో డాక్టర్ వీ రంగారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఎంఈఓలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కార్మికులకు గతంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వేతనంగా ఇచ్చేవారని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రూ. 3 వేలకు పెంచిందన్నారు. పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.
ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఈవో సూచించారు. సోమవారం గైర్హాజరయ్యే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వివరాలు ఎంఈఓలు తనకు అందజేయాలని ఆదేశించారు.
![]() |
![]() |