స్పందన కార్యక్రమాన్ని సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు కరోనా ప్రోటోకాలను పాటించి తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అందజేయాలని సూచించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారు.
![]() |
![]() |