ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరిలో గడ్డివాములు దగ్ధం కావడంతో రూ. లక్ష మేర నష్టం వాటిల్లింది. ఆదివారం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, ప్రకాష్ అనే రైతుల రెండు గడ్డివాములకు నిప్పంటు కుంది. అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పేశారు. బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గోవిందరాజులు అధికారులను కోరారు.
![]() |
![]() |