కర్నూలు నగరంలోని బిరా కాంపౌండ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ కిరణ్‌బాబు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను పరిశీలించి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోబుల గ్రామానికి చెందిన టేకుల గిరిగా గుర్తించారు. గిరి బంధు వులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
![]() |
![]() |