ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువన జ్వాలా నరసింహస్వామి ఆదివారం శరభవాహనంపై ఊరేగారు. లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించాక తన కోపాన్ని తగ్గించేందుకు శివుడు శరభాసురుడు అనే రాక్షసుడిని పంపించాడని, స్వామి ఆ రాక్షసుడిని చంపి కోపాన్ని తగ్గించుకున్నాడని వేదపండితులు తెలిపారు.
దీంతో బ్రహ్మోత్సవాల ఆరో రోజు శరభవాహనంపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమాల్లో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్, ఈవో నరసయ్య, మఠం అధికారి సంపత్, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, వేదపండితులు పాల్గొన్నారు.
![]() |
![]() |