ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడుమూరు బ్యాంక్ ఆధ్వర్యంలో బండగట్టు గ్రామ ప్రజలకు ఎంవి రూరల్ ఫోక్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం వారు బ్యాంకులలో ఉన్నటువంటి పథకాల గురించి, బ్యాంకు అందించే రుణాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా పథకాల గురించి జీవన జ్యోతి బీమా యోజన పథకం, సురక్ష బీమా పథకం, అటల్ పెన్షన్ యోజన పథకం, జనరల్ ఇన్సూరెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో కళాజాత వారు మాటలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ మల్లికార్జున, ఫీల్డ్ కర్నూలు నోడల్ ఆఫీసర్ రాగిని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |