రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గిరిజన విద్యార్థి సమాఖ్య నాయకులను, గిరిజన విద్యార్థి సమాఖ్య రాయలసీమ జిల్లాల అధ్యక్షులుని స్థానిక బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్సై రామి రెడ్డి, శివశంకర్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర నాయక్ ని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ. నిరుద్యోగులను అక్రమంగా అరెస్టులు చేయడం అన్యాయమని అన్నారు. ఉద్యమాలతో విద్యార్థి యువతకు ఉపాధి కలిగించే వరకు పోరాడుతామన్నారు.
![]() |
![]() |