ఆటో ప్రమాదంలో మహేశ్వరమ్మ కుటుంబ సభ్యులు గాయపడగా వారి కుమార్తె కు కాలు విరగడము జరిగిన కేసు నమోదు చేయలేదని వెంటనే కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులకు ఎస్. బాబా ఫక్రుద్దీన్ సిపిఐ మండల కార్యదర్శి ఆర్. సామేలు డిమాండ్ చేశారు.
వారు మాట్లాడుతూ మహానంది మండలం తమ్మడపల్లి వద్ద గత ఇరవై రోజుల కిందట సిపిఐ పార్టీ నాయకురాలు మహానంది పంచాయతీ వార్డు మెంబర్ మహేశ్వర్ మ్మ వారి కుటుంబ సభ్యులు ఆరు మంది కార్యానికి వేరే గ్రామానికి వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తున్న గా ఎదురుగా వస్తున్న బుల్లోరా వాహనం స్పీడుగా వచ్చి ఢీ కొట్టగానే అందులో ఉన్న వారి కుమార్తె కాళ్ళు విరిగి ఐదు మందికి తీవ్రగాయాలు కావడం జరిగింది. హుటాహుటిన 108 వాహనము లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో కూడా కేసు నమోదు చేసి మహానంది పోలీసులకు పంపడం జరిగిందన్నారు.
మహేశ్వరమ్మ ప్రమాదంలో కోలుకొని మహానంది పోలీస్ స్టేషన్లకు వెళ్లి స్థానిక ఎస్ఐ తో కేసు నమోదు చేసారా అని అడగగా ఏ మాత్రం పొంతన లేని సమాధానం చెప్పడం కాకుండా ఇంతవరకు కేసు కూడ నమోదు చేయకపోవడం దారుణమని సిపిఐ జిల్లా నాయకులు మహానంది పోలీస్ స్టేషన్ వెళ్లగా పోలీసు అధికారులు ఒకరిమీద ఒకరు చెప్పడము జరుగుతుందని అన్నారు. వెంటనే పోలీస్ అధికారులు కేసు నమోదు చేయకపోతే సిపిఐ పార్టీ. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని పై నాయకులు తెలిపారు.
![]() |
![]() |