ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే అక్రమ అరెస్టు చేయించడం చాలా సిగ్గుచేటుకరమని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సొంటి పులి శేఖర్, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి రంగస్వామి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా జాబు రావాలంటే బాబు పోవాలని వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులు అనే మాట ఎక్కడ విడిపోకూడదని చదువుకున్న ప్రతి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి మడమ తిప్పిన చరిత్ర వైయస్ జగన్మోహన్ రెడ్డి దక్కిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి యువతకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే మీ ప్రభుత్వాలకు కూడా పట్టుకుందని, ఇలాంటి అక్రమ అరెస్టుల తో యువజన ఉద్యమాలను ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
![]() |
![]() |