శ్రీశైలం ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఎత్తివేయడంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ముదురు ఆకుపచ్చ కొండల మధ్యన శ్రీశైలం గేట్ల నుంచి దుంకుతున్న కృష్ణమ్మ అందాలు అబ్బురపరుస్తున్నాయి. అటువైపు వెళ్తున్న ప్రయాణీకులను, అక్కడికి వస్తున్న పర్యాటకులను ఆ దృశ్యం కట్టిపడేస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ లోకి పై నుంచి భారీగా వరద వస్తుండటంతో కింద ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నారు.