విజయవాడలో శనివారం జరుగు మహా ధర్నా నేపథ్యంలో ముందస్తుగా ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టుచేసి ఉద్యమాన్ని ఆపలేరని జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆదోనిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులును ముందస్తు ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించాలని, ఇచ్చిన మాట ప్రకారం ఖాళీగా ఉన్న 2. 35 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
మెగా డీయస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్‌లో ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని, ఏపీపీఎస్సీలో నెగటివ్ మార్కులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంచి నిరుద్యోగులను మోసం చేయడం అన్యాయమన్నారు.
![]() |
![]() |