కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగ 24 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 బైకులు, 20 సెల్ ఫోన్లు, 2 ఆటోలు, రూ. 75, 500 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సిరివెళ్ల సిఐ చంద్రబాబు నాయుడు, రుద్రవరం ఎస్సై నిరంజన్ రెడ్డి, వారి సిబ్బంది కలసి కోటకొండ గ్రామ సమీపంలో భారీగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. మరో 13 మంది వ్యక్తులు పారిపోయారన్నారు.
![]() |
![]() |