ఆలూరు మండలంలోని పెద్ద హోతూరులో జరిగే హుచ్చు వీరప్ప తాత రథోత్సవాన్ని తిలకించేందుకు వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడటంతో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆలూరు నుంచి పెద్ద హోతూరుకు భక్తులను తరలించేందుకు నిర్వాహకులు మినీ ట్రక్కు ఏర్పాటు చేయగా 20 మంది భక్తులు ఎక్కారు. గ్రామానికి సమీపంలో ఎద్దుల బండిని తప్పించబోయి కల్వర్టును ఢీకొని వాహనం బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108లో ఆలూరు ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. ఘటనలో బళ్లారి జిల్లా హోస్పేట్ కు చెందిన చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన ఎర్రి స్వామిలకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యసేవల కోసం డాక్టర్లు బళ్లారి ఓపీడీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామానుజులు తెలిపారు.
![]() |
![]() |