బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల-బెలుం రహదారిలోని తారుప్లాంట్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మీర్జాపురానికి చెందిన పిక్కిలి లక్ష్మయ్య (35) మృతి చెందాడు. మీర్జాపురం నుంచి సాయంత్రం ట్రాక్టర్ లో గొర్రె పిల్లలను తీసుకొని అవుకు మండలం శింగనపల్లెలో వదిలిపెట్టి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.
తారుప్లాంట్ సమీపానికి రాగానే ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మయ్య ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాలీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. లక్ష్మయ్యను హుటాహుటిన కొలిమిగుండ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడి కుటుంబీకులు, బంధువులు కొలిమిగుండ్లకు చేరుకొని బోరున విలపించారు. గ్రామ సర్పంచ్ లాయర్ మహేశ్వరరెడ్డి ప్రమాద వివరాలను సేకరించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
![]() |
![]() |