ఆడపిల్లలు పుట్టారని భర్త, అత్త ఇంటి నుంచి గెంటేశారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్తే. అక్కడ పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. సార్ న్యాయం చేయండి అంటూ కర్నూలు జిల్లాలోని డోన్‌కు చెందిన బుడగ జంగం విభూది లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం ఆమె కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట డోన్ పోలీసుల తీరును నిరసిస్తూ ముగ్గురు ఆడపిల్లలతో కలసి ధర్నాకు కూర్చుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
తనకు విభూది సురేంద్ర అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, ముగ్గురు ఆడపిల్లలు జన్మించడంతో భర్తతోపాటు అత్త అంజనమ్మ తనను వేధించారన్నారు. మగ బిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకుని తనను ఇంటి నుంచి గెంటేశారన్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే డోన్ సీఐ న్యాయం చేయలేదని, పైగా తననే బెదిరిస్తుండడంతో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |