కర్నూలు జిల్లాలోని వివిధ సెబ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడిన వివిధ రకాల 137 వాహనాలను వేలం వేయనున్నట్లు సెబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ భరత్ నాయక్ తెలిపారు.
ఈ నెల 13వ తేదీ ఆదోని సెబ్ స్టేషన్, 14వ తేదీ ఆలూరు సబ్ స్టేషన్, 15వ తేదీ ఎమ్మిగనూరు సెబ్ స్టేషన్, 16వ తేదీ కోడుమూరు సెబ్ స్టేషన్, 17వ తేదీ పత్తికొండ సెబ్ స్టేషన్లలో వాహనాలను వేలం వేయనున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న వారు ఆధార్, పాన్ కార్డుతో పాటు తగిన రుసుం చెల్లించి, ఎంట్రీ పాట్లు పొంది, ఆయా సెబ్ స్టేషన్లలో వాహన వేలంలో పాల్గొనాలని భరత్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |