సావిత్రీబాయి పూలే 25వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిం చారు. ఇందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని బీసీ సంఘం కార్యాలయంలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జాతీయ బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం సావిత్రీబాయి పూలే చేసిన సేవలు మరువ లేనివన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లుగౌడ్, రఘురాముడు యాదవ్, పరమేశ్వరుడు, నాగలక్ష్మమ్మ, రాణెమ్మ, కళ్యాణి, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
![]() |
![]() |