బండి ఆత్మకూరు మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపాన ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం నంద్యాల నుంచి ఆత్మకూరు మండలం అమలాపరానికి చెందిన ఆటో ఆత్మకూరు వైపు వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న అమలాపురానికి చెందిన నాగరాజు, అంకన్న, దర్గయ్య గాయాలపాలయ్యారన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసికె ళ్లారు. ఆటోను స్టేషన్‌కు తరలించారు.
![]() |
![]() |