దోమల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మహానంది మండలం తిమ్మాపురం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం మహానంది పరిసరాల్లోని పార్వతీపురం, ఈశ్వర్‌నగర్ కాలనీల్లోని మురుగు కాల్వల్లో ప్ర త్యేక వైద్య బృందం సభ్యులు అసిస్టెంట్ డైరెక్టర్ బీఎల్‌ఎన్ కుమార్, నూకరాజు డీఎంఓ( కర్నూలు), ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, వెంకటేశ్వరరెడ్డి తోపాటు రిటైర్డ్ డీఎంఓలు ఆదినారాయణ, వేణుగోపాల్ పాల్గొని లార్వా దోమ శాంపిల్స్‌ను సేకరించారు. వీటిని రాజమండ్రిలోని ల్యాబ్‌కు టెస్టింగ్ కోసం పంపుతామన్నారు. ఈసందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్టణం, రాజమండ్రి, మహానందిల్లోని మురుగుకాల్వల్లో లార్వా దోమ శాంపిల్స్‌ను సేకరిస్తున్నామని చెప్పారు. వీటిని పరీక్షించిన అనంతరం 15 రోజుల తర్వాత బయోకెమికల్ మందును ఇదే పరిసరాల్లో స్ర్పే చేసి ఆరునెలల తర్వాత మరోసారి లార్వా దోమ మీద ల్యాబ్‌లో పరిశీలిస్తామని తెలిపారు.
![]() |
![]() |