హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 05:53 PM
 

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ ఎన్నిక‌ల్లో వీవీపాట్ యంత్రాల‌ను వినియోగిస్తామ‌ని చెప్పారు. వీవీపాట్ యాంత్రాల్లో స్క్రీన్‌ సైజు 5.6 సెం.మీ నుంచి 10 సెం.మీ.లు పెంచుతున్నామని, దీంతో ఓట‌ర్లు తేలిక‌గా వాటిని ఉప‌యోగించే వీలు ఉంటుంద‌ని చెప్పారు.హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల నియమావళి అమ‌లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అభ్య‌ర్థుల గ‌రిష్ఠ ఎన్నిక‌ల వ్య‌యం రూ.28 ల‌క్ష‌లని చెప్పారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, న‌వంబ‌ర్ 9న ఎన్నికలు జ‌రుగుతాయ‌ని, ఓట్ల కౌంటింగ్ డిసెంబ‌రు 18న ఉంటుంద‌ని తెలిపారు. అలాగే, డిసెంబరు 18కి ముందుగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.