పెళ్లి తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన సమంత

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 04:48 PM
 

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున ప్ర‌ధానపాత్ర‌లో రూపుదిద్దుకున్న ‘రాజుగారి గ‌ది-2’ సినిమా రేపు విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా కొత్త పెళ్లి కూతురు స‌మంత పెళ్లి త‌రువాత తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో సమంత కూడా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాగార్జునతో క‌లిసి పాల్గొంది. ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ స‌మంత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. స‌మంత‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప‌లువురు ఎగ‌బ‌డ్డారు.