పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు నాన్-బెయిల‌బుల్ వారెంట్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 04:24 PM
 

పాకిస్థాన్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా నాన్‌-బెయిల‌బుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేస్తూ పాకిస్థాన్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆదేశాలు జారీ చేసింది. పీటీఐ భావ‌జాల వ్య‌తిరేకి అక్బ‌ర్ ఎస్‌. బాబ‌ర్ వేసిన కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా ఇమ్రాన్ ఖాన్ కాలం వెల్ల‌బుచ్చుతున్నాడు. దీనిపై మండిప‌డిన ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అక్టోబ‌ర్ 26న జ‌ర‌గనున్న త‌దుప‌రి విచార‌ణ‌కు అత‌న్ని హాజ‌రు ప‌రచాల‌ని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ వారెంట్‌ను స‌వాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని పీటీఐ ప్ర‌తినిధి న‌యీముల్ హ‌క్ తెలిపారు. ఈ కేసులో ఇప్ప‌టికే రెండు సార్లు షోకాజ్ నోటీసులు, బెయిల‌బుల్ వారెంట్ల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ జారీ చేసింది. వాటిని ఇమ్రాన్ ఖాన్ ల‌క్ష్య‌పెట్ట‌లేదు. దీంతో విచార‌ణ‌లు వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.