భిక్షం అడుక్కుంటున్న రష్యా టూరిస్టుకు పోలీసుల సాయం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 03:42 PM
 

కాంచీపురం: హిందూ ఆలయం ముందు యాచిస్తున్న రష్యా టూరిస్టుకు తమిళనాడు పోలీసులు సాయం చేశారు. కాంచీపురంలోని శ్రీ కుమారకొట్టం ఆలయం ముందు రష్యా పర్యాటకుడు ఎవాంజిలిన్ భిక్షం అడుక్కుంటూ కనిపించాడు. ఏటిఎమ్ పిన్ లాక్ కావడంతో డబ్బులు డ్రా చేసుకోలేకపోయిన అతను.. ఆ తర్వాత అక్కడున్న ఆలయం వద్దే డబ్బులు యాచిస్తూ కనిపించాడు. అయితే అతన్ని ఆ తర్వాత లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత అతనికి పోలీసులు కొంత సాయం చేశారు. రష్యా పర్యాటకుడు భిక్షం ఎత్తుకుంటున్న అంశంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ట్వీట చేశారు. ఎవాంజిలిన్‌కు సాయం చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. రష్యా టూరిస్టుకు డబ్బులు అందజేసిన పోలీసులు అతన్ని చెన్నైలో ఉన్న రష్యా కౌన్సులేట్‌కు పంపించారు.