నూజివీడు ఎస్సైని మూడు నెలలపాటు సస్పెండ్

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 02:28 PM
 

పశ్చిమగోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన బ్యూటీషియన్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమె భర్తను వేధింపులకు గురిచేసి సస్పెన్షన్ కు గురైన వారంరోజుల్లోనే వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో నూజివీడు ఎస్సై వెంకటకుమార్‌ మూడు నెలల సస్పెన్షన్ కు గురయ్యారు. భర్తకు సంబంధించిన కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వివాహిత ఫోన్ నెంబర్ తీసుకున్న వెంకటకుమార్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఆమె భర్తను కేసు నుంచి తప్పించాలంటే లాడ్జ్ లో తనతో గడపాలని ఒత్తిడి చేశాడు. తానలాంటి దానిని కాదని ఆమె ప్రాధేయపడ్డా ఆమెపై వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె అతని ఫోన్ వేధింపుల వాయిస్ రికార్డులతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించిన ఎస్పీ, ఆయన ట్రాక్ రికార్డును చెక్ చేశారు. అయితే అతనిపై పలువివాదాలు ఉండడంతో మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.