కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 01:10 PM
 

అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యేను కూడా పక్కకు నెట్టేశారు. ఈ ఘటన గుంతకల్లు పట్టణంలోని రెండో వార్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా కౌన్సిలర్ గుణశేఖర్, మాజీ ఎంపీటీసీ మస్తానమ్మ వర్గీయుల మధ్య ప్రారంభమైన గొడవ చివరకు పరస్పర దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇరు వర్గాల వారు ఒక్కసారిగా దూసుకురావడంతో... ఆయన కాలికి గాయమైంది. మరోవైపు ఈ ఘటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వీధుల్లో పరస్పర దాడులకు తెగబడితే, పార్టీ పరువు ఏమవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.