ఆత్మకూరు పట్టణానికి చెందిన ఇద్దరూ వైద్య విద్యార్థులు ఉక్రెయిన్లో చదువుతుండగా అక్కడ జరుగుతున్న యుద్ధ కారణాల వల్ల అక్కడే ఉండిపోయారని ఇద్దరిని దేశానికి తీసుకుని వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆత్మకూరులో ఒకే కుటుంబానికి చెందిన ఇంజమామ్, సబియా సుల్తాన అన్న చెల్లెలు ఇద్దరు అక్కడే చదువుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.