జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె. వి మహేష్ ఉత్తర్వుల మేరకు కర్నూలు రూరల్ సర్కిల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉలిందకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి లక్ష్మిపురము గ్రామములోని బ్రిడ్జి వద్ద నాటుసారా అమ్ముతున్నటువంటి పెద్ద లక్ష్మన్న , 32 సం తండ్రి గిడ్డయ్య ( లేట్) , లక్ష్మీపురం గ్రామము, కల్లూరు మండలము అను వ్యక్తిని అదుపులోనికి తీసుకొని అతని వద్ద నుండి 10 లీటర్ల నాటుసారా సీజ్ చేసి అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి, రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఎవరైనా మండలంలో నాటుసారా, మట్కా, పేకాట. లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ రైడ్ లో ఎస్ఐ తో పాటు ఉలిందకొండ పోలీసులు సురేష్, శేఖర్ పాల్గోన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa