ఆదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఆముదం క్వింటా గరిష్ట ధర రూ. 6, 593 పలికింది. ఆముదం ధర రూ. 60 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ఆముదం కనిష్ట ధర రూ. 5, 023, మధ్య ధర రూ. 6, 480, గరిష్ట ధర రూ. 6, 593 వరకు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సోమవారం మార్కెట్కు 20 (64 క్వింటాళ్లు) లాట్స్ ఆముదం కొనుగోలు జరిగినట్లు వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa