వైద్యుల మూకుమ్మడి బదిలీలను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. ముందుగా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కార్యాచరణ ప్రకటించుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ బయలుదేరి జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడం వల్ల పిల్లల చదువులు ఇబ్బందిలో పడతాయన్నారు.
మరో వైపు పీజీ, యూజీ విద్యార్థులకు బోధన సైతం ఇబ్బందిగా మారుతుందని, వారికి త్వరలో పరీక్షలు కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతమున్న వైద్యులు బదిలీ అయితే భవిష్యత్ లో బోధనాసిబ్బంది లేక కళాశాల, ఆసుపత్రిలోని పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు రద్దయ్యే అవకాశం ఉందన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa