పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బతకాల్సిన జంటలు ఇతర వ్యక్తుల మోజులో పడుతున్నారు. క్షణికానందం కోసం వేరే వారితో సంబంధం పెట్టుకుంటున్నారు. దీంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు బంధాన్ని మధ్యలోనే తుంచేసుకుని, కొత్తగా పరిచయమైన వారితో వెళ్లిపోతున్నారు. మరికొందరు అవి భరించలేక, దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలో భార్య, ఆమె ప్రియుడిని అభ్యంతరకర స్థితిలో చూసిన ఓ భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం కోయిలతోట గ్రామంలో శ్రీనివాస్, గాయత్రి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం వారిరువురికీ పెళ్లయింది. ఇటీవల అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే వ్యక్తితో గాయత్రికి పరిచయం ఏర్పడింది. అది చివరికి వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి వ్యవహారం శ్రీనివాస్‌కు తెలిసింది. అయినా సమయం కోసం అతడు వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య ఫోన్లో ఆమె తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను శ్రీనివాస్ గురువారం చూశాడు. పట్టరాని ఆగ్రహంతో రగిలిపోయాడు. తాను బయటికి వెళ్తున్నట్లు చెప్పి, ఇంటికి సమీపంలో మాటు వేశాడు.
ఇది తెలియని గాయత్రి తన ప్రియుడికి ఫోన్ చేసి రప్పించుకుంది. వారిరువురూ సన్నిహితంగా ఉన్న సమయంలో హఠాత్తుగా గదిలోకి వచ్చాడు శ్రీనివాస్. కోపంతో గొడ్డలి తీసుకుని భార్య, ఆమె ప్రియుడినీ దారుణంగా నరికి చంపాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, హత్య విషయం చెప్పి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa