ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్న, బాబాయి ఆశయ సాధనకు కృషి చేస్తా: భూమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2017, 11:22 AM

నాన్న, బాబాయి ఆశయ సాధనకు కృషిచేస్తానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అలాగే 13 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, చామ కాల్వ విస్తరణతో భారీ వర్షాలు పడినా ఇబ్బంది ఉండదన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి డబ్బులు అకౌంట్లల్లో జమ చేస్తున్నామని బ్రహ్మానందారెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com