శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పాదయాత్రగా తరలి వెళ్లే యాత్రికులకు ఎలాంటి అంతరాయం కలిగినా సత్వర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాదయాత్రగా తరలి వెళుతున్న భక్తులకు అటవీ మార్గంలోని నాగలూటి, పెచ్చెరువు ప్రాంతాల్లో ఆరోగ్యసమస్యలతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలిగినా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే సత్వరం స్పందిస్తామని తెలిపారు. అలాగే ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు. సత్వర సేవల కోసం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సెల్ నంబర్లు 9704107 460, 9440226514 అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa