శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న శివస్వాములు, భక్తులకు గూడూరు మండల పరిధిలోని కె. నాగలాపురంలో గ్రామదేవత సుంకులా పరమేశ్వరీదేవి ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వైస్ చైర్మన్ నాగభూషిరెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన వెళ్లే భక్తులకు వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa