ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరి మండలం నగరడోణ వద్ద ప్రభుత్వం రూ. 37. 73 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జలాశయం పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు డీఈ మంజునాథ్, గుత్తేదారు మల్లికార్జునరెడ్డితో కలిసి జలాశయం నిర్మించే ప్రాంతాన్ని ఇంజనీర్లు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ జలాశయం పూర్తయితే చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో 4, 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa