శ్రీశైలంలో ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో ఎస్. లవన్న తెలిపారు. సామూహిక అభిషేక సేవాకర్తలు, విరామ దర్శన సేవాకర్తలకు ఈ ఐదు రోజులు స్పర్శ దర్శనం అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే గురు, శుక్రవారాలలో భక్తులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. ఈ ఐదు రోజులు అన్ని అర్జిత సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు ఈ ఐదు రోజులలో నిర్దిష్ట సమయాలలో విడతల వారీగా స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. అయితే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు స్వర్శదర్శనానికి అవకాశం లేదన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa