ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో కోనేరులో పుణ్యస్నానాలు: ఈవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 12:41 PM

కోనేరులో త్వరలో పుణ్యస్నానాలకు అవకాశం కల్పిస్తామని మహానంది ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో ఆయ న మాట్లాడారు. ఈ నెల 27 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహానంది బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఈవో చెప్పారు. ఆలయంలో పనిచేసే సిబ్బంది కట్టు బొట్టు వ్యవహార శైలిలో మార్పులు తీసుకొస్తామని అన్నారు. అవినీతికి పాల్పడ్డ సిబ్బందిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే దేవస్థానం కొబ్బరికాయల విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా స్టాక్‌ తక్కువగా ఉండటానిన గుర్తించామని చెప్పారు. ఇం దుకు ఇద్దరు ఉద్యోగులకు మెమోలు జారీ చేశామని తెలిపారు. పరిపాలన పరంగా తప్పులు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఆలయంలో భక్తులకు విక్రయించే పులిహోరలో నాణ్యత తగ్గిందని ఈవో దృష్టికి తీసుకొని రాగా పరిశీలిస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa