ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు: మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 10:21 AM

కర్నూలు మండలంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, క్లస్టర్ యూనివర్సిటీ సముదాయ భవనలను రూ. 88. 50 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా తగ్గి ఉన్న పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు.


కర్నూలు జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్లస్టర్ యూనివర్సిటీ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అనేది కేవలం ఆర్థిక శాఖ మంత్రికే చెల్లిందన్నారు. రాష్ట్ర ఆదాయం తక్కువ ఉన్న కూడా రూ. 1. 30 వేల కోట్ల రూపాయలతో నగదు బదిలీ కింద సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా రూ. 13 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. విద్యా శాఖకు సంబంధించి అమ్మబడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర వాటి కోసం ఈ మూడు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేశామన్నారు.


విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేస్తూ విద్యాలయాల రూపురేఖలు మార్చి వేస్తూ విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉండేలా 15700 స్కూల్స్ లో రూ. 3, 700 కోట్ల రూపాయలతో మొదటి దశలో నాడు నేడు కింద ఖర్చు చేశామన్నారు.


రాబోయే రోజులలో స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు నాడు నేడు కింద సుమారు రూ. 11 వేల కోట్ల రూపాయలతో సమూలంగా మార్పు చేస్తామని వెల్లడించారు. పేదరికం విద్యకు అడ్డు రాకూడదని, పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నత విద్యకు దూరం కాకూడదు. ఉద్యోగ అవకాశాలు కల్పించే విద్య, నైపుణ్యత కూడిన విద్యను అందించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన విధానం అన్నారు.


అందుకోసం అహర్నిశలు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ నిర్మించతలపెట్టామన్నారు. కర్నూల్ లో రాయలసీమ యూనివర్సిటీ తోపాటు రెండవ యూనివర్సిటీ క్లస్టర్ యూనివర్సిటీ భవనాలను నిర్మిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa