ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న చిరంజీవి సతీమణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 03:02 PM

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవికి వెళ్లిన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందించి, ఆశీర్వచనం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి చిత్రపటాన్ని అందించారు. సురేఖతో పాటు వారి బంధువులు కూడా ఈ సందర్భంగా ఆలయానికి వచ్చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com