ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ స్టార్ హీరోలపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 11:50 AM

వివాదాలతో సావాసం చేసే ప్రముఖ నటి కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్ హీరోలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదాయ, వయసు అంతరాలు, అఫైర్లపై గతంలో సంచలన ఆరోపణలు చేసిన కంగనా, ఈ సారి వారి కుటుంబ నిర్ణయాలపై మండిపడింది. పదిహేనేళ్ల అమ్మాయితో గంతులేసే హీరోలు తమ కూతుళ్ళు బికినీలు వేస్తే కాళ్ళు విరగ్గొడతామని వార్నింగులు ఇస్తుంటారని ఎద్దేవా చేసింది. అలాగే తమ కొడుకులను హీరోలుగా నిలబెట్టేందుకు పడరాని పాట్లుపడే హీరోలు, తమ కూతుళ్లను హీరోయిన్లను చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారని ఎద్దేవా చేసింది. అయితే అందరు హీరోలు అలా లేరని తెలిపింది. తన కుమార్తె బికినీ వేస్తే కాళ్లు విరగ్గొడతానని షారూఖ్ పేర్కొనగా, తన కుమార్తె సినిమాల్లో నటిస్తానంటే కాళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెడతానని సంజయ్ దత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. షారూఖ్ బాలీవుడ్ బాద్షాగా పేరుతెచ్చుకోగా, సంజయ్ దత్ సీనియర్ స్టార్ హీరోగా సత్తాచాటుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com