ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్కలు బాబోయ్.. కర్రలతో వీధుల్లో గ్రామస్తుల పహారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:31 PM

కర్నూలు జిల్లా: కోవెలకుంట్ల మండలంలోని జోలదరాసి గ్రామంలో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కల దాడి నుండి తమను తాము రక్షించుకునేందుకు కర్రలు చేతపట్టుకొని వీధుల్లో తిరుగుతున్నారు. పిచ్చికుక్కల స్వైర విహారం చేస్తూ, గ్రామస్తులను దాడులు చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.


దీంతో కుక్కల బారి నుంచి రక్షించుకునేందుకు ఇలా కర్రలు చేతపట్టుకొని వీధుల్లో పహారా నిర్వహిస్తున్నారు. కుక్కల బారి నుంచి రక్షణ కల్పించాలని, ఆధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడి నుండి రక్షించాలని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa